KRNL: గోనెగండ్ల మండలం ఒంటెదుదిన్నె గ్రామంలో సాగులో ఉన్న టమాటా పంట పొలాలను ఎమ్మిగనూరు నియోజకవర్గ MLA జయనాగేశ్వర రెడ్డి ఇవాళ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట పరిస్థితులు, సాగు ఖర్చులు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలపై వివరాలు తెలుసుకున్నారు. ధరలు తగ్గిపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు MLA దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.