సిద్ధూ జొన్నలగడ్డ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో ఆయన చేయనున్న సినిమా మే నుంచి పట్టాలెక్కనుంది. ఈలోపే ఒక కొత్త దర్శకుడు చెప్పిన సోషియో ఫాంటసీ కథకు సిద్ధూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ రెండు చిత్రాలను ఆయన ఒకేసారి సమాంతరంగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు టాక్. విభిన్న జోనర్లలో సినిమాలు చేస్తూ సిద్ధూ తన జోరును కొనసాగిస్తున్నాడు.