NRPT: పలు కాలనీల్లో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సీపీఎం జిల్లా నాయకుడు బలరాం అన్నారు. ఆదివారం ఉదయం నారాయణపేట పట్టణంలోని పలు కాలనీల్లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని ప్రజలు నేతల దృష్టికి తీసుకొచ్చారు.