VZM: రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానిక పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విద్యార్ధులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దని, ధైర్యంగా, సంతోషంగా పరీక్షలు వ్రాయాలని సూచించారు. ఈ సందర్భంగా పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులందరికీ విజయం కలగాలని ఆకాంక్షించారు.