సినిమాలకు పోటీగా టీవీ రంగం కూడా ఉందని సీనియర్ నటుడు మురళీ మోహన్ అన్నాడు. టెలివిజన్ రంగానికీ అవార్డులు ఇవ్వాలిని ఆకాంక్షించాడు. సినిమాకైనా.. టీవీకైనా మూలం నాటకమని పేర్కొన్నాడు. అందుకే నాటకాలకు కూడా అవార్డులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు పేరిట సినీరంగంలోని పలువురికి అవార్డులు ఇచ్చిన విషయం తెలిసిందే.