బియ్యం నీరుతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బియ్యం నీటిలోని ఇనోసిటాల్, విటమిన్లు దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేసి కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఇది చుండ్రును తగ్గించి, జుట్టును సిల్కీగా, ఒత్తుగా మారుస్తుంది. అరకప్పు బియ్యాన్ని 2 కప్పుల నీటిలో 30 నిమిషాల నుంచి 24 గంటలు నానబెట్టి, ఆ నీటిని వారానికి 1-2 సార్లు వాడాలి. అతిగా వాడితే జుట్టు పొడిబారుతుంది.