PDPL: ముత్తారం మండలం లక్కారం కోదండ రామాలయం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ అత్తే చంద్రమౌళి ఆధ్వర్యంలో శాంతి కళ్యాణం, హోమం నిర్వహించారు. పూజారి శ్రీనివాస చారి పూజలు చేయగా, అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకల్లో మాజీ సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజు రెడ్డి, ఉప సర్పంచ్ రాజూకుమార్ పాల్గొన్నారు