ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. ముందుగా 2026 జూన్ 25న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఇది 2027 మార్చి 7కు మారనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావడం, దర్శకుడు నీల్ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఎక్కువ సమయం తీసుకుంటుండటమే ఈ జాప్యానికి కారణమని టాక్.