WNP: ఆత్మకూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మున్సిపల్ ఛైర్ పర్సన్ గాయత్రి నాగమణి రాజేష్ నూతన చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. 1999-2000 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు కలిసి ఈ ఏర్పాటు చేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మహేందర్, నాని, కురుమూర్తి, రాము, తదితరులు పాల్గొన్నారు.