WNP: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం సెలవు దినమైనా మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పన్నులు సేకరిస్తున్నారు. ఈ నెల చివరి నాటికి ప్రజలందరూ బాకీలు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ఆదేశాల మేరకు సిబ్బంది కోరుతున్నారు.