SRD: పటాన్ చెరువులో ‘ఎలైట్ అండ్ రిచ్’ కాలనీలుగా పేరొందిన శాంతినగర్, శ్రీనగర్ కాలనీలలో ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం శాంతినగర్లో కొత్తగా పార్కు పనులను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి వయస్సు వారికి అనుకూలంగా ఉండే విధంగా పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.