ADB: హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆదివారం నిర్వహించనున్న మాల జంగం మహేశ్వర్ల సంక్షేమ సంఘం మహాసభకు జిల్లా నుంచి భారీగా తరలివెళ్లారు. జిల్లా అధ్యక్షుడు గాజరి వినోద్ ఆధ్వర్యంలో కుల బాంధవులు ప్రత్యేక వాహనాల్లో పయనమయ్యారు. జై మాల జంగం అంటూ నినాదాలతో ఉత్సాహంగా బయలుదేరారు. ఈ సభకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు వారు తెలిపారు.