TG: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ముస్లిం సంక్షేమాన్ని పక్కన పెట్టిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. BRS పథకాలను పక్కన పెట్టేశారని, మూసీ, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్నారని మండిపడ్డారు. భూమాత తెచ్చి ‘భూ మేత’ చేశారని ఆరోపించారు. 30% కమీషన్ ఇస్తేనే భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు.