SDPT: గ్రామ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర కీలకమని తంగళ్లపల్లి సర్పంచ్ బోయిని సంపత్ అన్నారు. కోహెడ మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలో పనిచేస్తున్న సిబ్బందిని ఆయన సన్మానించి శానిటేషన్ కిట్లు అందజేశారు. గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ యాటెల్లి సంతోష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.