PDPL: ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నేడు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించనున్నారు. దీంతో ప్రజలు ఇకపై పెద్దపల్లి, కరీంనగర్ వెళ్లకుండా సమీపంలోనే మెరుగైన వైద్య సేవలు పొందనున్నారు.