KDP: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ భాగాల కమిటీల నియామకాలు చేపట్టింది. ఇందులో భాగంగా పోరుమామిళ్లకు చెందిన చాపాటి లక్ష్మీనారాయణరెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తమపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి పదవి వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.