WGL: నగరంలోని కాశిబుగ్గ నుండి కాంగ్రెస్ శ్రేణులు నేడు పెద్దఎత్తున HYD తరలివెళ్లారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు MLC బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు హైదరాబాదు బయలుదేరారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆయూబ్ జెండా ఊపి వాహనాలు ప్రారంభించారు.