NLR: పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల సాకుతో ఎగుమతిదారులు ధరలు తగ్గించడంతో ఇందుకూరుపేట ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలోకు రూ.40 వరకు తగ్గించడంతో ఎకరాకు రూ.80వేల నష్టం వాటిల్లుతోంది. ఖర్చులు పెరిగిన తరుణంలో కార్పొరేట్ కంపెనీల దోపిడీపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని మత్స్యశాఖ జేడీ తెలిపారు.