KDP: ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామికి ఉగాది పర్వదినాన గురువారం హైదరాబాద్ వాస్తవ్యులు క్రాంతి కుమార్ బంగారు పొదిగిన రెండు రాగి కిరీటాలను కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించారు. ఈ సందర్భంగా సీతారాముల కోసం తెచ్చిన కిరీటాలను టీటీడీ ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, అర్చకులు మనోజ్ కుమార్కు అందజేశారు. వీటి విలువ రూ.65 వేలు ఉంటుందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.