E.G: ప్రభుత్వ సమీకృత బీసీ బాలికల హాస్టల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రాజమండ్రి అర్బన్ తహశీల్దార్ పాపారావు పరీక్షా సామగ్రి అందజేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి. రాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.