NLG: వేసవి తాకిడికి నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. తెలంగాణలో ఏకైక నిమ్మ మార్కెట్ అయిన నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం నిమ్మ బస్తా (23 కిలోల టిక్కి) 2 వేల నుంచి 2 వేల ఐదువందల రూపాయలు వరకు ధర పలుకుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో నిమ్మ సాగు అవుతుంది. తెగుళ్ల కారణంగా నిమ్మ దిగుబడి గణనీయంగా తగ్గింది.