బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా నాగమోహన్ కృష్ణను ఎంపిక చేయడం పట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేపల్లెకు వచ్చిన నాగమోహన్ కృష్ణకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమని, అందరి సమన్వయంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.