కోనసీమ: ఆలమూరు జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి మతిస్థిమితం లేని వృద్ధురాలిని రావులపాలెం పోలీసులు రక్షించారు. మూలస్థానం హైవేపై తిరుగుతున్న ఆమెను స్థానికులు 112కి కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ విద్యాసాగర్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆమెను రక్షించి సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఆమె కాట్రేనికోనకి చెందిన నల్లా లీలావతిగా గుర్తించారు