ATP: రాయదుర్గంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన యూట్యూబర్ అమీర్ బాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. హోటళ్లు మూతపడ్డాయని, ఇతర ప్రాంతాల ఫోటోలతో తప్పుడు వీడియోను వైరల్ చేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ జగదీశ్ తెలిపారు. ప్రజల్లో అశాంతి, గందరగోళం రేకెత్తించేలా వ్యవహరించినందుకు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.