కోనసీమ: అంబాజీపేట మండలంలోని 3 కేంద్రాలలో 10 వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంఈవో కాండ్రేగుల నాగేశ్వరరావు తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ మండలంలో 500 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అరగంట ముందే విద్యార్థులు హాల్ టికెట్‌తో హాజరుకావాలని సూచించారు.