పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. యూఎస్ మార్కెట్లో ఈ సినిమా ప్రీమియర్ బుకింగ్స్ మొదట్లో జోరుగా సాగి, ఆపై కాస్త నెమ్మదించాయి. అయితే, తాజాగా ఈ చిత్రం నార్త్ అమెరికాలో 2 లక్షల డాలర్ల గ్రాస్ మార్కును దాటినట్లు డిస్ట్రిబ్యూటర్లు ధృవీకరించారు. పవన్ క్రేజ్‌తో వసూళ్లు మళ్లీ పుంజుకుంటాయని మేకర్స్ భావిస్తున్నారు.