MBNR: మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలని అఖిల భారత యాదవ మహాసభ రూరల్ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు యాదవ సమాజక వర్గం పూర్తిస్థాయిలో అండగా నిలబడ్డ సంగతి గుర్తుంచుకోవాలన్నారు. యాదవులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు.