SRCL: చందుర్తి మండల కేంద్రంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో పండితులు ఆయాచితుల పవన్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం సుభిక్షం, సస్యశ్యామలం ఉంటుందని తెలిపారు. పవన్ శర్మను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ శాలవతో సన్మానించి పండ్లు అందజేశారు.