TG: ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతులకు పూజలు నిర్వహించారు. అనంతరం బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ భేటికి బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబెనెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇప్పటికే సీఎం రేవంత్, మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు.