TG: హైదరాబాద్ గన్‌పార్క్ దగ్గర BRS ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేయడం ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తోంది.