BHNG: మోత్కూరు మండలం రాగిబావిలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. పార్టీ ‘పోరుబాట’లో భాగంగా నిన్న ఆయన గ్రామంలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. వేసవిలో ఈదురు గాలుల వల్ల ఈ తీగలు రైతులకు, పశువులకు ప్రాణసంకటంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.