VKB: కొత్తబావి వెంకటమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలి కూతురు లక్ష్మి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బండవెల్కిచర్లకు చెందిన చింపిరి మంజుల, ఆమె భర్త భీరయ్య, బంధువు అరుణ్ కుమార్ కలిసి పక్కా పథకం ప్రకారం వెంకటమ్మకు మద్యం తాగించి హత్య చేశారు.