ప్రకాశం: గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె గ్రామంలో పీఎం సూర్య ఘర్ సోలార్ రూఫ్ పథకాన్ని మంత్రి గొట్టిపాటి రవి ప్రారంభించారు. మంత్రి 111 మంది ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్‌లు అందించారు. ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం కలెక్టర్ పాల్గొన్నారు.