పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రస్థాయిలో నాలుగు అవార్డులు సాధించడంపై ఎమ్మెల్యే విజయరమణరావు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ సేవలకుగాను సూపరింటెండెంట్ డా. శ్రీధర్, రేడియాలజిస్ట్ డా. సంధ్యారాణి అవార్డులు అందుకోవడం గర్వకారణమన్నారు. ఏడాదిలో లక్షలాది మందికి మెరుగైన వైద్యం అందించిన సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.