ATP: జిల్లాలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పి.జగదీష్ శనివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా, సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.