NLG: మాడుగులపల్లి మండలం చెరువుపల్లి గ్రామ సర్పంచ్ వడ్డే సైదిరెడ్డి తల్లి అండమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఇవాళ ఆమె దశదినకర్మను వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిప్పర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్ తదితరులు హాజరై అండమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.