KMM: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి చేయి కోల్పోయిన శిశువు కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ శిరోమణి డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం డీఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. చిన్నారికి విద్యా, వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, ఈ ఘటనకు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.