SRPT: హుజూర్ నగర్ పట్టణంలో ప్రతిపాదిత నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్థలాన్ని పరిశీలించారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో సుమారు రూ.3 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక బస్టాండ్ మంజూరైంది. స్థల పరిశీలన సందర్భంగా నిర్మాణానికి సంబంధించిన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.