TG: అమీర్‌పేట్ అగ్నిప్రమాదంలో మెట్రో పిల్లర్ క్రాక్ వచ్చిందని వస్తున్న వార్తలను మెట్రో అధికారులు ఖండించారు. ప్రమాదస్థలానికి పిల్లర్ దగ్గరగా ఉన్నందునే పరిశీలించామని తెలిపారు. ప్రకటన బోర్డు కాలి.. దాని లిక్విడ్ పిల్లర్‌పై పడిందని, మెట్రో పిల్లర్‌కు ఎలాంటి క్రాక్ లేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలతో ప్రజలను ఆందోళనకు గురి చేయవద్దని హెచ్చరించారు.