NZB: నిజామాబాద్ ఏసీపీ బి.ప్రకాష్ యాదవ్ గురువారం మోపాల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈ తనిఖీల్లో భాగంగా స్టేషన్లోని రికార్డులను, పెండింగ్లో ఉన్న వివిధ కేసు ఫైళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు.