అన్నమయ్య: అమరావతి సచివాలయంలో క్యాబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజలను కలుసుకుని అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా విన్న మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు.