రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీపై అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి ‘ధురంధర్’ ఓ ఉదాహరణ అని తెలిపాడు. భారీ యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని చెప్పాడు. రణవీర్ సింగ్ చేసిన హై-ఎనర్జీ యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు జేజేలు కొట్టారని చెప్పుకొచ్చాడు.