‘అసెంబ్లీ రౌడీ’ సినిమా గురించి సీనియర్ హీరో మోహన్ బాబు ట్వీట్ చేశారు. 1991లో విడుదలైన అసెంబ్లీ రౌడీ చిత్రం తనకు కలెక్షన్ కింగ్ అనే టైటిల్ ఇచ్చిందన్నారు. ఈ సినిమా 200 రోజులు ఆడిందని, భారీ వసూళ్లు రాబట్టడంతో తనకు ఆ టైటిల్ వచ్చిందన్నారు. తన కెరీర్లో ఈ మూవీకి ఎంతో ప్రత్యేక స్థానం ఉందన్నాడు.
కామెడీ డిటెక్టివ్ వెన్నెల కిశోర్ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడనేది ఈ మూవీ కథాంశం. వెన్నెల కిషోర్ ఏడుగురు అనుమానితులను మార్క్ చేస్తాడు. మర్డర్‌లో చనిపోయింది ఎవరు? వారికి వీరితో సంబంధం ఏంటి? కేసును వెన్నెల కిశోర్ ఎలా ఛేదించాడనేది కథ. నటన, కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్, కామెడీ సీన్స్ ప్లస్. ట్విస్టులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకపోవడం మైనస్. రేటింగ్ 2.5/5
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన రష్మికా మందన్న నటించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ ప్రధాన పాత్రలో రాహుల్ సంకృత్యాన్ ఓ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. ఇక 2025 ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు. శ్రీతేజ్‌ను చూడాలని అందరికీ ఉన్నా.. కొన్ని పరిధుల వల్ల రాలేకపోయామని పేర్కొన్నారు. కొరియోగ్రాఫర్స్ తరపున శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటామని.. తన కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడటం లేదని వెల్లడించారు.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిష ఇంట విషాదం నెలకొంది. క్రిస్మస్ పర్వదినం రోజు తన కుమారుడు మృతి చెందాడని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసినవారంతా షాక్‌కు గురవుతున్నారు. అసలు విషయం ఏంటంటే త్రిష గత పన్నెడేళ్లగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ఈ రోజు ఉదయం మృతి చెందిందట. ఈ విషయాన్ని త్రిష తన కుమారుడు జోరో చనిపోయాడని వెల్లడించింది.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో దర్శకుడు AR మురుగదాస్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘సికందర్’. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 27న సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేయనున్నారట. దీని సెన్సార్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ టీజర్ నిడివి మొత్తం 1:45 నిమిషాలు ఉంటుందట.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప 2’ మూవీ భారీ విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఈ సినిమా హిందీలో రూ.715 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ వీకెండ్‌కి ఈజీగా రూ.750 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.
‘జోధా అక్బర్’ సినిమాలో ఐశ్వర్యరాయ్ ధరించిన లెహెంగాకు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ మ్యూజియంలో చోటు దక్కింది. ఈ విషయాన్ని తెలుపుతూ అకాడమీ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ‘ఈ సినిమాలో రాణికి ఈ లెహెంగా మరింత అందాన్ని తెచ్చింది. ఎంతోమందిని ఆకర్షించిన దీన్ని ఆస్కార్ మ్యూజియంలో ప్రదర్శించనున్నాం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది’ అంటూ రాసుకొచ్చింది.
TG: రేపు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. FDC ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. సీఎంతో భేటీపై హీరోలు, నిర్మాతలకు దిల్ రాజు సమాచారం ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, ఇవాళ అల్లు అరవింద్, దిల్ రాజు శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు విరాళం ఇచ్చారు.
నాగ చైతన్య విషయంలో తాను ఎంతో ఆనందంగా ఉన్నానని అక్కినేని నాగార్జున తెలిపారు. చైతూతో పరిచయం కంటే ముందే తనకు శోభితా ధూళిపాళ్ల తెలుసని చెప్పారు. శోభిత ఎంతో అందమైన, మంచి మనసున్న అమ్మాయని కొనియాడారు. చైతన్య జీవితంలోకి ఆమె వచ్చినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాగా.. చైతూ, శోభిత పెళ్లి ఈ నెలలోనే జరిగిన విషయం తెలిసిందే.
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. హీరో అల్లు అర్జున్ తరపున రూ.కోటి, పుష్ప-2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
సినీ నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు. బాలుడి తండ్రి భాస్కర్‌తో వారిద్దరూ మాట్లాడనున్నారు. బాధిత కుటుంబానికి అందించాల్సిన సాయంపై వారు చర్చించనున్నారు. కాగా, సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి చనిపోగా.. గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో విచారణ ఖైదీలుగా కొనసాగుతున్న మరో ఐదుగురికి బెయిల్ మంజూరైంది. బెంగళూరు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పును ప్రకటించింది. దీంతో హత్యకేసును ఎదుర్కొంటున్న మొత్తం 17మంది బెయిల్‌పై బయటకు వచ్చారు. వీరిలో వినయ్, పవిత్రగౌడ అసిస్టెంట్ పవన్, రాఘవేంద్ర, వినయ్, నందీశ్కు బెయిల్ మంజూరైంది.
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘లైలా’. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి సోను మోడల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. విశ్వక్.. స్టైలిష్ అండ్ రిచ్ కిడ్‌లా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన చేతులపై ఉన్న టాటూస్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇక ఈ మూవీ 2025 ఫిబ్రవరి 14న విడుదలవుతుంది.
టాలీవుడ్లో ఇటీవల నెలకొన్న పరిస్థితులపై మంచు విష్ణు ‘మా’ అసోసియేషన్ సభ్యులకు పలు సూచనలు చేశారు. ‘ప్రభుత్వాల మద్దతుతోనే సినీ పరిశ్రమ ఎంతో ఎదిగింది. ప్రతీ ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. సున్నిత అంశాలపై సభ్యులు బహిరంగ ప్రకటనలు చేయవద్దు. వివాదాస్పద అంశాల జోలికి ఎవరూ వెళ్లవద్దు. చట్టం తన పని తాను చేస్తుంది. అందరూ సంయమనం పాటించాలి’ అని విజ్ఞప్తి చేశారు.