పరిశ్రమకు వచ్చే రచయితలు, దర్శకులకు దర్శకుడు హరీష్ శంకర్ కీలక సూచనలు చేశాడు. ‘ఇండస్ట్రీ మనల్ని మార్చకుండా ఉంటే చాలు, అన్నిటికంటే ముఖ్యంగా మనలోని ‘ప్రేక్షకుడు’ చనిపోకూడదు. పరిశ్రమలో రచయితలకు క్రెడిట్, పారితోషికం తక్కువ.. ఆ విషయంలో నేను మొదటినుంచి కచ్చితంగా ఉంటాను’ అని తెలిపాడు. అనుకున్న ఫీల్డ్‌లో ఉండటమే సక్సెస్ అని, సినిమా హిట్ అవ్వడం అనేది బోనస్ అని పేర్కొన్నాడు.