TPT: ఏర్పేడు మండల కేంద్రంలోని వినాయకుడి గుడి సమీపంలో ఉన్న చారిత్రాత్మక కోనేరు గుంటను చెత్త కుప్పలుగా ఉపయోగించడం పర్యావరణానికి హానికరమని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మండల పరిషత్, రెవెన్యూ అధికారులు వెంటనే డంపింగ్ యార్డ్‌కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.