AP: వచ్చే ఎన్నికల్లో తాను గుంటూరు-2 నుంచి పోటీ చేస్తానని మాజీమంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కాపులంతా తమవైపే ఉన్నారని పవన్ కళ్యాణ్ భ్రమపడుతున్నారని, ప్రతిసారీ అలాగే జరగదని ఎద్దేవా చేశారు. ఇక డిప్యూటీ సీఎం పదవిపై స్పందిస్తూ.. పవన్‌కు కనీసం ఒక డీఎస్పీని బదిలీ చేసే అధికారం కూడా లేదని విమర్శించారు. కూటమిలో డిప్యూటీ సీఎంలకు పవర్స్ ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు.