SKLM: టెక్కలి నియోజకవర్గానికి జలజీవన్ మిషన్ కింద త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.602 కోట్లు నిధులు మంజూరుపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు టెక్కలిలో కోటబొమ్మాళి AMC ఛైర్మన్ బగాది శేషగిరి రావు ఆధ్వర్యంలో శనివారం సీఎం చంద్రబాబు, మంత్రులు అచ్చన్న నాయుడు, రామ్మోహన్ నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.