ఏపీ సీఎం చంద్రబాబు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. ఇటీవల జరిగిన అల్లు శిరీష్ వివాహ వేడుకకు బిజీ షెడ్యూల్ వల్ల చంద్రబాబు హాజరుకాలేకపోయారు. ఈ క్రమంలోనే తాజాగా అరవింద్ నివాసానికి వెళ్లిన సీఎం, నూతన వధూవరులను కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులతో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు.