KMM: జిల్లాలో శనివారం జరిగిన పదవ తరగతి పరీక్షకు 99.88% విద్యార్థులు హాజరు అయ్యారని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 16 వేల 962 విద్యార్థులకు గాను మొత్తం 16 వేల 941 మంది విద్యార్థులు హాజరు అయ్యారని చెప్పారు. జిల్లాలో ప్రశాంతంగా పది పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్ష రాయాలని సూచించారు.