NRPT: మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వీధి నాటక ప్రదర్శనకు సూర్యచంద్ర ఫౌండేషన్ అధినేత సూర్య మోహన్ రెడ్డి రూ. 11,000 విరాళంగా నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడానికి వీధి నాటకాలు మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఆంజనేయులు, పోలేమోని అశోక్ తదితరులు పాల్గొన్నారు.